భారతదేశం, ఆగస్టు 5 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి సప్లిమెంటరీ/కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. సీబీఎస్ఈ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షను జూలై 15 నుంచి 22 వరకు నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు చాలా సబ్జెక్టులకు పరీక్షలు జరగ్గా, కొన్ని పరీక్షలు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగాయి.

cbse.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా విద్యార్థులు ఫలితాలను తనిఖీ చేయవచ్చు. మీ సౌలభ్యం కోసం ఈ పేజీలో ఫలితాలకు ప్రత్యక్ష లింక్ కూడా కింద ఇస్తున్నాం.. తద్వారా మీరు నేరుగా మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు పొందిన మార్కులతో సంతృప్తి చెందకప...