భారతదేశం, ఫిబ్రవరి 16 -- సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న మెుదలు. షెడ్యూల్ ప్రకారం వివిధ సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షకు ముందు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రం, రిపోర్టింగ్ సమయ వివరాలను తనిఖీ చూసుకోవాలి. సమస్యలను నివారించడానికి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులు భయపడకుండా సరైన వ్యూహంతో పరీక్షలు రాయాలి.

ఏ ఒక్క ప్రశ్నకూ ఎక్కువ సమయం వెచ్చించకండి. మీకు ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే, దానిని ఆపేసి.. తర్వాత తిరిగి చివరలో రండి. రేఖాచిత్రాలను స్పష్టంగా, సరైన లేబుల్‌లతో గీయండి. మీ సమాధానాలను తిరిగి చెక్ చేసుకోవడానికి చివరి 10-15 నిమిషాలు వెచ్చించండి. ముందుగా ప్రశ్నపత్రం మొత్తాన్ని జాగ్రత్తగా చదవండి. సులభమైన ప్రశ్నలను ముందుగా పరిష్కరిస్తే మీ ఆత్మవ...