Telangana, ఆగస్టు 22 -- సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచారు.

సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. ఆయన తండ్రి పేరు వెంకట్రామిరెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా విద్యను పూర్తి చేశారు. చిన్నతనం నుంచి వామపక్ష పార్టీలో చేరిన ఆయన. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపట్ల సీపీఐ, సీపీయంతో పాటు పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Published by HT Digital Content Services with permission f...