భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయాల్లో ఆప్షన్ ఓపెన్ అయ్యిందని సిబ్బంది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రాయితీ సహా ఇతర సదుపాయాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను సులభంగా, వేగంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు లేనివారు గ్రామ, వార్డు సచివాలయాలతో పాట...