Hyderabad, ఏప్రిల్ 6 -- పెళ్లికి శుభలేఖ ఎంతో ముఖ్యం. ప్రతి శుభలేఖలో కూడా సీతారాముల కళ్యాణాన్ని ఒక శ్లోకం రూపంలో రాస్తారు. భార్యాభర్తలు అంటే అందరికీ గుర్తొచ్చేది సీతారాములే. సీతారాముల్లాంటి భార్యాభర్తలు అని అన్యోన్యమైన జంటను చూసి చెబుతూ ఉంటారు. సీతారాముల్లాంటి గుణాలు భార్యాభర్తల్లో ఉంటే ఆ సంసారం పచ్చగా ఉంటుందని ఎప్పటికీ విడిపోరని కూడా చెప్పుకుంటూ ఉంటారు.

ఆదర్శ దాంపత్యానికి సీతారాములు ఎలా ఉదాహరణగా మారారు? వారి నుంచి నేటి భార్యాభర్తలు తెలుసుకోవలసిన నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇక్కడ వివరించాము. ప్రతి దంపతులకు సీతారాములు ఆదర్శనీయం. శ్రీరాముడి జీవితంలో ముఖ్యమైన స్త్రీ.. సీతమ్మ.

భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలని, అదే సతీ ధర్మమని ఈ లోకానికి చాటి చెప్పింది సీతమ్మ. అందుకే ఆమె ఆదర్శమూర్తిగా మారింది. రామాయణంలో అరణ్యవాసానికి భర్తతోపాటు బయలుద...