Hyderabad, సెప్టెంబర్ 21 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బాగా జరుగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల ప్రక్రియ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూలు, సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలా నిన్న శనివారం నాటి ఎపిసోడ్‌లో ఓనర్స్‌ని టెనంట్స్‌గా, టెనంట్స్‌ను ఓనర్స్‌గా మార్చి ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున.

ఇక తాజాగా ఆదివారం అంటే ఇవాళ్టీ (సెప్టెంబర్ 21) ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లతో ఫన్ క్రియేట్ చేశాడు. ఇవాళ తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు 9 ప్రోమో ఆకట్టుకుంటోంది. డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సీరియల్ హీరోయిన్ తనూజ గౌడను లేపి "ఇప్పటిదాకా కిచెన్‌లో ఏం చేస్తున్నావ్" అని అడిగాడు.

దానికి "ప్లీజ్ నాగ్ సర్ ఒక చిన్న కాఫీ పౌడర్ ఇప్పించండి" అంటూ తనూజ వేడుకుంది. "ఒక చిన్న సీక్రెట్ చెబితే...