భారతదేశం, ఆగస్టు 28 -- క్యూట్ బ్యూటీ నివేదా పేతురాజ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఆమె వేరే వాళ్లతో డేటింగ్ లో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు, స్టోరీ పెట్టింది. ఈ ఫొటలతో నివేదా ఎంగేజ్మెంట్ జరిగిందనే క్లారిటీ వచ్చింది.

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతని పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్‌. రాజ్‌హిత్ ను రొమాంటిక్ గా హగ్ చేసుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది నివేదా. ఈ ఫొటోకు రెండు రెడ్ లవ్ ఎమోజీలు, మధ్యలో అంతులేని ప్రేమను చాటే ఇన్ఫినిటీ ఎమోజీను పెట్టి పోస్టు చేసింది నివేదా.

ఇక ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లోనూ రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ఉన్న ఫొటోలను నివేదా షేర్ చేసింది. ఈ పిక్స్ ...