భారతదేశం, డిసెంబర్ 9 -- ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది. ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా సస్పెన్స్, ఉత్కంఠతో కూడిన సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే నయనం వెబ్ సిరీస్. ఇందులో వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. పెద్ద తెరపై విజయాలు అందుకోలేకపోతున్న వరుణ్.. రూటు మార్చి చిన్న తెరపైకి వస్తున్నాడు. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.

సైకో థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన నయనం వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. మంగళవారం (డిసెంబర్ 9) ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో వరుణ్ సందేశ్ షేడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో డిసెంబర్ 19న నేరుగా రిలీజ్ కానుంది. ఇది 6 ఎపిసోడ్ల సిరీస్ గా రానుంది.

హైదరాబాద్ లో ఇవాళ నయనం సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. యూట్యూబ్ లో రిలీజై...