భారతదేశం, ఆగస్టు 4 -- ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ద్వారా 70,000 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఈ 70 వేల మంది సైనికుల పోస్టులను వచ్చే ఐదేళ్లలో కేంద్రం భర్తీ చేయనుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1.62 లక్షల నుంచి 2.20 లక్షలకు పెంచేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.

ఏటా సగటున 14,000 మంది సిబ్బందిని నియమించాలని సీఐఎస్ఎఫ్ యోచిస్తోంది. ఐదేళ్లలో 70 వేల నియామకాలు జరుగుతాయి. ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో నక్సలిజం తగ్గుముఖం పట్టడంతో కొత్త పారిశ్రామిక కేంద్రాలు ఆవిర్భవిస్తాయని భావిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను అంతమొందించేందుకు 2026 మార్చి వరకు భద్రతా దళాలకు డెడ్ లైన్ విధించారు కేంద్రమంత్రి అమిత్ షా.

2024లో సీఐ...