భారతదేశం, ఏప్రిల్ 17 -- సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్ష తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తుది ఆన్సర్ కీని సీఎస్ఐఆర్ నెట్ అధికారిక వెబ్సైట్ csirnet.nta.ac.in లో చూసుకోవచ్చు.

2025 ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 2 తేదీల్లో దేశవ్యాప్తంగా 164 నగరాల్లో ఉన్న 326 పరీక్షా కేంద్రాల్లో 2,38,451 మంది అభ్యర్థులకు ఎన్టీఏ ఈ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షను నిర్వహించింది. అనంతరం, మార్చి 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల కాగా, అభ్యర్థులు 2025 మార్చి 14 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది.

అభ్యర్థులు నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి ఆన్సర్ కీని సవాలు చేసే అవకాశం కల్పించింది. అభ్యర్థుల అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలించి,...