Hyderabad, జూలై 7 -- ఈమధ్యే రైడ్ 2 సినిమాతో కెరీర్లో మరో హిట్ అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇప్పుడు హైదరాబాద్ పై కన్నేశాడు. ఇక్కడ ఓ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశాడు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ సోమవారం (జులై 7) క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌...