భారతదేశం, జూన్ 14 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం (జూన్ 14) రాత్రి హైదరాబాద్ లో హైటెక్స్ లో ఈ ఈవెంట్ కన్నుల పండుగగా సాగింది. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలతో కార్యక్రమం అదిరిపోయింది. అవార్డులు గెలుచుకున్నవాళ్లకు షీల్డ్ తో పాటు నగదు బహుమతి అందించారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ గా మారింది.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలెట్టింది. గతంలో ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఇచ్చేవాళ్లు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అవార్డులు ఊసే లేకుండా పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తోంది.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024క...