భారతదేశం, డిసెంబర్ 2 -- డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల మందికిపైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

మంగళవారం రాత్రే రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఖర్గే, రాహుల్ గాంధీలకు ఆహ్వానం పలికిన తర్వాత.. ఆయన డిసెంబర్ 3న మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరిగి వస్తారని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని అభివృద్ధి ...