భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు వేడుకలను టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే మంత్రులు సైతం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హోమం నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివి వేదపారాయణం చేసే 599 మంది పండితులకు రూ.53.91 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. నెలకు రూ.3 వేల చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిరుద్యోగ భృతిని పండితులకు చెక్కుల రూపంలో అందించారు. హోమంలో పాల్గొన్న 8 వేల మందికి చీరలు, పంచెలు, తిరుమల లడ్డును మంత్రి ఆనం పంపిణీ చేశారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్బంగా ధా...