భారతదేశం, జనవరి 16 -- వెరైటీ టైటిల్ తో తెరకెక్కిన మలయాళ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ 'భా భా బా'. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కామనర్ కిడ్నాప్ చేసే కథతో ఈ సినిమా వచ్చింది. ఇందులో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పవర్ ఫుల్ డాన్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ సినిమా ఇవాళ (జనవరి 16) ఓటీటీలోకి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

మలయాళ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ భా భా బా ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇందులో దిలీప్ లీడ్ రోల్ ప్లే చేయగా, మోహన్ లాల్ పవర్ ఫుల్ డాన్ గా మెరిశారు.

భా భా బా సినిమా డిసెంబర్ 18, 2025న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి...