Hyderabad, మే 19 -- వేసవిలో కొండ ప్రాంతాలకు వెళ్లాలని ఎంతోమంది కోరుకుంటారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో చాలా చల్లగా ఉంటుంది. అందుకే హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటారు. ఎంతోమంది తమిళనాడు, కర్ణాటకలోని హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. నిజానికి తెలుగు రాష్ట్రాల వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీలోనే ఎన్నో అందమైన హిల్స్ స్టేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్న కొండ ప్రాంతాలు గురించి ఇక్కడ ఇచ్చాము. వీటికి వెళ్తే మీకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది. పైగా ప్రకృతి సౌందర్యం పచ్చదనం ఆహ్లాదాన్ని కూడా అందిస్తాయి.

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది హార్స్లీ హిల్స్. ఇది ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా పిలుచుకుంటారు. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ హార్స్లీ హిల్స్ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ...