భారతదేశం, ఫిబ్రవరి 27 -- సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఒక పద్ధతి. ఇక్కడ మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా వివిధ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

సిప్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే ఎవరైనా ముందుగా తమ టార్గెట్ నిర్ణయించుకోవాలి. పదవీ విరమణ కోసం కావచ్చు, విద్యకు కావచ్చు, కారు లేదా ఇల్లు కొనడంలాంటి టార్గెట్‌ పెట్టుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మీ సిప్ కాలపరిమితిని కూడా నిర్ణయించుకోవాలి. సిప్‌లు పెట్టుబడిదారులను క్రమశిక్షణ కలిగిన పెట్టుబడిదారులుగా ప్రోత్సహించడం, కాంపౌండింగ్ శక్తి నుండి ప్రయోజనం పొందేందుకు క...