భారతదేశం, ఏప్రిల్ 24 -- పెట్టుబడి పెట్టడానికి కూడా ఓపిక చాలా అవసరం. క్రమబద్ధమైన పెట్టుబడి వ్యూహానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా కావాలి. సిప్‌లు నెమ్మదిగా, స్థిరమైన ప్రయోజనాలను అందిస్తాయి. సిప్ ద్వారా కాలక్రమేణా మీ పెట్టుబడులను వైవిధ్యపరచవచ్చు, తద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ పొందవచ్చు, మీ డబ్బును రక్షించుకోవచ్చు.

ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు 25 సంవత్సరాల వయస్సులో ప్రతి నెలా రూ.10,000 సిప్‌లో పెట్టుబడి పెడితే 60 సంవత్సరాల వయస్సు వరకు ఓపికగా వేచి ఉండాలి. 12 శాతం వడ్డీ అంచనా వేయాలి. కచ్చితంగా ప్రతి నెలా పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా నిర్వహిస్తే పెట్టుబడిదారుడి 60 సంవత్సరాల వయస్సు నాటికి సిప్ మెుత్తం మొత్తం 5.51 కోట్లు అవుతుంది. పెట్టుబడి పెట్టిన మెుత్తం రూ.42,00,000. అంటే అతని ఓర్పు అతని సంపద అని అర్థం.

మరొక వ్యక్తి 35 సంవత్సరాల వ...