భారతదేశం, ఏప్రిల్ 24 -- విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) లో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా కోర్సులకు నోటఫికేషన్ విడుదలైంది.

విజయవాడ సిపెట్‌ లో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ), డిప్లొమా ఇన్ పాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిపెట్ డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ తెలిపారు.

బీఎస్సీ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధిగల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రొసెస్సింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ-పీపీటీ) కోర్సుకు ఆన్లైన్ విధానంలో మే 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఈ కోర్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉందని, సిపెట్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)ను జూన్ 8న ...