భారతదేశం, ఫిబ్రవరి 7 -- తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. శివాజీ, లయ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ (ఫిబ్రవరి 7) రిలీజ్ చేశారు. చీఫ్ గెస్ట్ గా అనిల్ రావిపూడి అటెండ్ అయ్యి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది ఫిబ్రవరి 12న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ కానుంది. ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ డైరెక్టర్. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై శివాజీ సొంటినేని నిర్మించారు. ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాలో శివాజీ, లయ, అలీ, ధన్ రాజ్, ప్రిన్స్, చంద్ర, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు నటిస్తున్నారు.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ...