భారతదేశం, ఫిబ్రవరి 18 -- మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ప్రశ్నించిన విద్యార్థి నేతలను కిడ్నాప్ చేసినట్లు నమోదైన కేసులో నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని, అలాగే విచారణ పూర్తయ్యే వరకు తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో అరెస్ట్ నుంచి ఎటువంటి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రధాన పిటిషన్ పై లోతైన విచారణ జరుపుతామంటూ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మార్చి 3కు వాయిదా వేశారు.
ఈనెల 3వ తేదీన మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజుల వసూళ్లపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు SFI విద్యార్థి సంఘం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.