Hyderabad, జూలై 17 -- తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారు. కానీ, వారికి ఆశించినంత స్థాయిలో సరైన గుర్తింపు దక్కలేదు. వారు ప్రతి సినిమాల్లో ఏదో ఒక పాత్రతో అలరిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు చిట్టి ఒకరు.

ఎందరో హీరోలతో కలిసి ముఖ్య పాత్రలు పోషించిన నటుడు చిట్టి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న చిట్టి ఈ సందర్భంగా ఆయన అసలు పేరు, చేసిన పాత్రల గురించి తెలిపారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నటుడు చిట్టి మాట్లాడుతూ.. "నేను కళామ్మతల్లి కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అందరూ నన్ను చిట్టి.. చిట్టి అనడంతో నా స్రీన్ నేమ్ చిట్టిగా మారింది. కానీ, నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం చందన లక్ష్మీ నరసింహారావు" అని అన్నారు.

"చిత్ర పరిశ్రమ మద్రాస్ నుం...