భారతదేశం, జూలై 14 -- ప్రముఖ దక్షిణ భారత నటి బి.సరోజా దేవి (87) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. వార్తా సంస్థ పిటిఐ కథనం ప్రకారం.. ఆమె బెంగళూరులోని మల్లేశ్వరం నివాసంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలతో మరణించారు. ఆమెను తమిళంలో కన్నడత్తు పైంగిలి (కన్నడ చిలుక) అని, కన్నడలో అభినయ సరస్వతి (భావాల సరస్వతి) అని పిలుస్తారు. దాదాపు 200 సినిమాల్లో సరోజా దేవి నటించారు. దిగ్గజాలు ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో సరోజా దేవి యాక్ట్ చేశారు.

బి.సరోజా దేవి మృతికి ఖుష్బూ సుందర్ సంతాపం తెలిపారు. "స్వర్ణ యుగం ముగిసింది. సరోజాదేవి అమ్మ గొప్ప నటి. దక్షిణ భారతదేశంలో ఆమెకున్న పేరు ప్రఖ్యాతలు మరెవరికీ లేవు. ఆమె చాలా ప్రేమగల వ్యక్తి. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. బెంగళూరుకు వెళ్లినప్పుడు ఆమెను కలవకుండా నా పర్యటన పూర్తయ్యేది కాదు. నేను చెన్నైలో ఉన్నప్పుడల్లా ఆమె ...