భారతదేశం, జూలై 21 -- ఓ బ్లాక్ బస్టర్ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా మహారాష్ట్రాలో హత్య జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేసింది. అతని మృతదేహాన్ని వారి ఇంటిలోనే పాతిపెట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

35 ఏళ్ల విజయ్ చవాన్ 15 రోజులుగా కనిపించకుండా పోయాడు. 28 ఏళ్ల భార్య కోమల్ చవాన్‌తో కలిసి ముంబై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలసోపారా తూర్పులోని గడ్గపడ ప్రాంతంలో నివసించేవాడు విజయ్. అయితే విజయ్ సోదరులు చాలా రోజుల నుంచి తమ సోదరుడు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సోమవారం ఉదయం విజయ్ కోసం వెతుకుతున్న అతని సోదరులు ఇంటికి వెళ్లారు. అక్కడ కొన్ని ఫ్లోర్ టైల్స్ మిగిలిన వాటి రంగుతో సరిపోలడం లేదని గ్రహించారు. అనుమానం వచ్...