భారతదేశం, నవంబర్ 6 -- కొరియోగ్రాఫర్, ఫిల్మ్‌మేకర్ ఫరా ఖాన్ తన తెలివి, సృజనాత్మకత, దర్శకత్వానికి ప్రసిద్ధి. కానీ ఆమె కొద్దికాలం పాటు యాక్టింగ్ కూడా చేశారని చాలా మందికి గుర్తుండదు. ఇటీవల ట్వింకిల్ ఖన్నా, కాజోల్ హోస్ట్ చేస్తున్న 'టూ మచ్' అనే చాట్ షోలో పాల్గొన్న ఫరా 2012లో 'షిరీన్ ఫర్హాద్ కీ తో నికల్ పడీ' సినిమాతో నటిగా అరంగేట్రం చేయడం గురించి మాట్లాడారు. అలాగే సినిమా సెట్స్ లో ఎఫైర్ల గురించి కామెంట్ చేశారు.

నటిగా మారాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ఫరా ఖాన్ ఇలా గుర్తుచేసుకున్నారు. "నిజానికి, నేను ఆ సినిమా ఎందుకు చేశానో నాకే తెలియదు. బహుశా నేను ఫాల్తూగా (పనిలేకుండా) కూర్చున్నానేమో. అప్పుడు బోమన్ (ఇరానీ) నాకు ఫోన్ చేశాడు. సంజయ్ భన్సాలీ మా ఇంటికి వచ్చి 'నేను ప్రతిరోజూ సెట్‌లో ఉంటాను' అని చెప్పారు. బోమన్‌తో పనిచేయడం బాగుంది" అని ఫరా తెలిపారు....