భారతదేశం, మే 7 -- సోనియా అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 7/జీ మూవీని తెలుగులో ఫ్రీగా చూడొచ్చు. ఈ హార‌ర్ మూవీ తెలుగు వెర్ష‌న్ మంగ‌ళ‌వారం యూట్యూబ్‌లో రిలీజైంది. 7/జీ మూవీకి హ‌రూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అత‌డే స్వ‌యంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ హార‌ర్ మూవీలో సోనియా అగ‌ర్వాల్‌తో పాటు స్మృతి వెంక‌ట్‌, సిద్ధార్థ్ విపిన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హీరోగా న‌టించిన సిద్ధార్థ్ విపిన్ 7/జీ సినిమాకు మ్యూజిక్ అందించ‌డం గ‌మ‌నార్హం.

గ‌త ఏడాది జూలైలో 7/జీ త‌మిళ వెర్ష‌న్‌ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. సోనియా అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో ఈ చిన్న సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. కానీ రొటీన్ స్టోరీ, రెగ్యుల‌ర్ హార‌ర్ ఎలిమెంట్స్‌ కార‌ణంగా 7/జీ స‌రైన వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోలేక...