భారతదేశం, డిసెంబర్ 11 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోగా, తాజాగా హృతిక్ రోషన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే అతడు కేవలం పొగడ్తలతో సరిపెట్టకుండా, సినిమాలోని రాజకీయ అంశాలపై తన భిన్నాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇదే పలువురు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న సినిమా దురంధర్. ఇది బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 10)నాడు హృతిక్ రోషన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ధురంధర్' పోస్టర్‌ను షేర్ చేస్తూ ఒక నోట్ రాశాడు.

"నేను సినిమాను ప్రేమిస్తాను. కథలో పూర్తిగా లీనమైపోయేవాళ్లను నేను ప్రేమిస...