భారతదేశం, ఫిబ్రవరి 8 -- బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ తారా సుతారియా ఈ మధ్య కాలంలో తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా వీర్ పహారియాతో ఆమె ప్రేమాయణం, ఆపై బ్రేకప్ గురించి నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తన మానసిక ప్రశాంతత, పబ్లిక్ ఇమేజ్ గురించి తారా సుతారియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ఎల్లె ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారా సుతారియా తన మనసులోని మాటను బయటపెట్టారు. "వృత్తి పరమైన విజయం కంటే అంతర్గత ప్రశాంతతే అసలైన విజయమని నేను నమ్ముతాను. కొద్దిమంది ఆత్మీయులు, మన గురించి మనకు తెలిసిన సత్యం.. ఇవే జీవితంలో ముఖ్యం. నా విలువల కోసం ఎన్నోసార్లు సినిమాలను వదులుకున్నాను. నన్ను నేను కోల్పోయే కంటే, ఒక సినిమాను కోల్పోవడమే నాకు ఇష్టం" అని తారా సుతారియా తేల్చి చెప్పారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.