భారతదేశం, జూన్ 28 -- భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మూవీ 'కన్నప్ప'. దీని కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడ్డారు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మరీ ఈ మూవీని తీర్చిదిద్దారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్లు కూడా భాగమయ్యారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ ఫస్ట్ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది కన్నప్ప మూవీ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకు ఫస్ట్ డే షాక్ తగిలింది. ఇండియాలో ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం కన్నప్ప మూవీ తొలి రోజు ఇండియాలో రూ.9 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.

తెలుగు పౌరాణిక చిత్రం కన్...