Hyderabad, మే 11 -- టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన లెవెన్ సినిమా మే 16న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 11) లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మనల్ని రక్షించడానికి వీరోచితంగా పోరాడుతున్న మన సైనికులకి బిగ్ సెల్యూట్. జైహింద్. ఈ సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. వాళ్ల రియాక్షన్స్ చూసినప్పుడు నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది" అని అన్నాడు.

"మే 15న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌ని ప్లాన్ చేశాం. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి చూసి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు నేను అక్కడే నిల్...