భారతదేశం, డిసెంబర్ 23 -- భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచిన 'హోమ్‌బౌండ్' (Homebound) సినిమాపై కాపీరైట్ వివాదం చెలరేగింది. జర్నలిస్ట్, రచయిత్రి పూజా చంగోయివాలా తన నవలను కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటూ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, అలాగే నెట్‌ఫ్లిక్స్‌పై న్యాయపోరాటానికి దిగారు. బాంబే హైకోర్టులో దావా వేయడానికి ఆమె సిద్ధమయ్యారు.

ఇండియా తరఫున 98వ ఆకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్)కు అధికారిక ఎంట్రీగా వెళ్ళిన 'హోమ్‌బౌండ్' మూవీ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన ఈ సినిమా కథ చోరీ చేసిందంటూ రచయిత్రి పూజా చంగోయివాలా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మేకర్స్ కు తాను లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు తెలిపారు.

పూజా చంగోయివాలా 2021లో 'హోమ్‌బౌండ్' పేరుతోనే ఒక నవలను ప్రచురించారు. ఇప్...