భారతదేశం, జనవరి 28 -- సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన వివాదాలను సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్‌పీ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ చిత్రాల టిక్కెట్ల ధరల పెంపుదలకు అనుమతిస్తూ ప్రభుత్వ మెమోను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మునుపటి ఆదేశాలను అప్పీల్‌ను సవాలు చేసింది. టిక్కెట్ ధరల పెంపుపై భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాన్ని కనీసం 90 రోజుల ముందుగానే ప్రకటించాలని సింగిల్ జడ్జి.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అప్పీల్ చేసింది.

తాజాగా ఇరువైపులా వాదనలు విన్న డివిజన్ బెంచ్.., సి...