భారతదేశం, మే 14 -- సినిమా టికెట్ల రేట్లు ఖరారుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధ‌ర‌ల ఖ‌రారుపై క‌మిటీని నియమించింది. హైకోర్టు ఆదేశాల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి నేతృత్వంలో 5 మంది స‌భ్యుల‌తో ఈ క‌మిటీ పనిచేయనుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కమిటీలో స‌భ్యులుగా స‌మాచార, ఆర్థిక శాఖ, న్యాయ శాఖల కార్యద‌ర్శులు, సినీ నిర్మాత వివేక్ కుచిభ‌ట్ల ఉంటారు.

ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన పలు సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి...