భారతదేశం, అక్టోబర్ 28 -- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని చెప్పిన ఆయన.. తాజాగా ధరల పెంపుకు అనుమతి ఇస్తామని చెబుతూనే ఓ షరతు విధించారు. అదేంటో చూడండి.

తెలంగాణలోనూ సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేస్తామని, అయితే అది జరగాలంటే టికెట్ల పెంపు వల్ల వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం (అక్టోబర్ 28) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సినీ కార్మికులు కలిసి సీఎంకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందే రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.

"పెద్ద పెద్ద సినిమాల హీరోలు, ప్రొడ్యూసర్లు వాళ్ల సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి ...