భారతదేశం, డిసెంబర్ 1 -- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. కానీ, తాజాగా నవంబర్ 30న జరిగిన సఃకుటుంబనాం మూవీ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు బుచ్చిబాబు. ఈ సందర్భంగా సఃకుటుంబనాం ట్రైలర్‌ను బుచ్చిబాబు సాన విడుదల చేశారు.

సఃకుటుంబనాం సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. హెచ్‌ఎన్‌‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహాదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. సఃకుటుంబనాం సినిమాకు ఉదయ్ శర్మ రచన, దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు సఃకుటుంబానాం సినిమా రానుంది. రామ్ చరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతోపాటు శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, ...