భారతదేశం, జనవరి 25 -- భారతీయ చలనచిత్ర సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి హిందీ చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న మతతత్వం (Communalism) కూడా ఒక కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) దీనిపై స్పందించారు. గతంలో రెహమాన్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న రామ్ గోపాల్ వర్మ.. ఇండస్ట్రీ పనితీరు పక్కా వ్యాపార కోణంలో ఉంటుందని తన విశ్లేషణను వినిపించారు.

ఫరీదూన్ షహర్యార్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ వృత్తిపరమైన అవకాశాలను మతపరమైన కోణంలో చూడటాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. "సినిమా పరిశ్రమ అంటేనే డబ్బు సంపాదించడం. ఎవరి వ...