భారతదేశం, డిసెంబర్ 3 -- హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోర'లోకి మరోసారి వెళ్లడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. 'అవతార్' సిరీస్‌లో మూడవ భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వరల్డ్ ప్రీమియర్ సోమవారం (డిసెంబర్ 1) రాత్రి హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో కన్నుల పండుగగా జరిగింది. ఈ షోలో సినిమా చూసిన ప్రముఖ జర్నలిస్టులు, సినీ విమర్శకులు సోషల్ మీడియాలో తమ ఫస్ట్ రివ్యూలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన రివ్యూలన్నీ పాజిటివ్‌గా ఉండటం విశేషం.

అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కు సుమారు 18 రోజుల ముందే ప్రీమియర్ షోలు వేయడం విశేషం. ఈ సినిమా చూసిన క్రిటిక్స్ జేమ్స్ కామెరాన్ టేకింగ్‌కు, విజువల్స్‌కు ఫిదా అయిపోయారు. మొదటి రెండు సినిమాలను ఇష్టపడ్డవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని చెబుతున్నారు.

వెరైటీ (Var...