భారతదేశం, డిసెంబర్ 11 -- ఒకప్పుడు బోల్డ్ పాత్రలతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి రాధికా ఆప్టే. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె ఇండియన్ సినిమాల్లో చూపిస్తున్న 'హింస'పై గళం విప్పింది. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న రాధిక.. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ సినిమాల్లో పెరుగుతున్న గోర్ (హింస) కల్చర్ పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

ది వెడ్డింగ్ గెస్ట్‌తోపాటు పార్చ్‌డ్, లేటెస్ట్ గా సిస్టర్ మిడ్‌నైట్ లాంటి సినిమాల్లో బోల్డ్ పాత్రలతో అలరించిన నటి రాధికా ఆప్టే. అలాంటి నటి సినిమాల్లో హింసను తప్పబడుతోంది. ప్రస్తుతం వినోదం పేరుతో అమ్ముడవుతున్న హింసను చూస్తుంటే తనకు భయమేస్తోందని రాధిక అనడం గమనార్హం.

"నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ ము...