భారతదేశం, జనవరి 29 -- బాలీవుడ్ నటి మోనా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా బోర్డర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ సీనియర్ నటి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో డబుల్ స్టాండర్డ్స్ ను ప్రశ్నించింది. వయసు విషయంలో మహిళల పరంగా ఎందుకు తేడా చూపుతారని మండిపడింది.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న కొహ్రా సీజన్ 2లో మోనా సింగ్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో పీటీఐ ఇంటర్వ్యూలో మోనా సంచలన వ్యాఖ్యలు చేసింది. మోనా 44 ఏళ్ల వయసులో స్క్రీన్ పై 50, 60 ఏళ్ల ఏజ్ ఉన్న క్యారెక్టర్లలో నటించడం గురించి మాట్లాడింది.

"నా ఆన్-స్క్రీన్ వయస్సు గురించి నేను పట్టించుకోలేదు. నేను నిజంగానే పట్టించుకోను. ఎందుకంటే నేను చాలా నమ్మకంగా ఉన్నా. ఆ క్యారెక్టర్ చేయగలనని తెలుసు. అలాగే నేనేంటో నాకు తెలుసు. నిరూపించుకోవడానికి కొత్తగా ఏమీ లేద...