భారతదేశం, డిసెంబర్ 8 -- లేటెస్ట్ తమిళ హిట్ మూవీ కాంత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది ఈ దుల్కర్ సల్మాన్ మూవీ. ఈ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ లో దుల్కర్ నట విశ్వరూపం చూపించాడనే కామెంట్లు వినిపించాయి. ఇందులో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఏ ఓటీటీలో వస్తుందో ఇక్కడ చూసేయండి.

రీసెంట్ టైమ్స్ లో సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించిన మూవీ పేరు కాంత. ఇదో మిస్టరీ థ్రిల్లర్. సినిమాలో సినిమా తీయడమే దీని కథ. అయితే ఇందులో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అదిరిపోయిందనే టాక్ వినిపించింది. అతని కెరీర్ లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రివ్యూలు చెప్పాయి. ఈ కాంత మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

కాంత సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ డైెరెక్టర్. స్పి...