భారతదేశం, నవంబర్ 20 -- ప్రియదర్శి పులికొండ, ఆనంది లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ప్రేమంటే. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 21) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉండగా.. ఓ అభిమాని ఎక్స్ ద్వారా ప్రియదర్శిని సినిమాలు మానేయమని సలహా ఇచ్చాడు. దీనికి అతడు ఇచ్చిన కౌంటర్ అభిమానులను ఆకర్షిస్తోంది.

ప్రియదర్శి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ సినిమాల్లో తన మార్క్ తెలంగాణ డైలాగులతో అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా తనకు సినిమాలు మానేయాలని సలహా ఇచ్చిన అభిమానికి అదే స్టైల్లో కౌంటర్ ఇవ్వడం విశేషం.

"నువ్వు సినిమాలు తీయడం ఆపు అన్నా ప్లీజ్ అన్నా" అని ఓ ఫ్యాన్ ట్వీట్ చేస్తూ ప్రియదర్శిని ట్యాగ్ చేశాడు. దీనిపై అతడు స్పందించాడు. "మరి ఏం చెయ్యమంటావ్.. గడ్డి పీకాల్నా" అని ప్రియదర్శి అన్నాడు. ఈ రిప్లై అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది...