భారతదేశం, డిసెంబర్ 3 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో నాలుగోసారి వస్తున్న లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మాతలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.

ఎస్ తమన్ సంగీతం అందించిన అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గోపి ఆచంట ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. "జై బాలయ్య. నందమూరి అభిమానులందరికీ స్వాగతం. ఒక సినిమాని భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే. సినిమాకి ఆక్సిజన్ లాంటివాళ్లు అభిమానులు. మీ అందరికీ మా నిర్మాతల తరఫున సినిమా ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు" అని అన్నారు....