భారతదేశం, ఏప్రిల్ 21 -- స్టార్ యాక్టర్లు అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన కేసరి చాప్టర్ 2 మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారత స్వాతంత్య్ర సమరంలో కీలక ఘట్టమైన జలియన్ వాలాబాగ్ మారణ హోమం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ దారుణానికి పాల్పడిన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కోర్టులో భారతీయ లాయర్ పోరాడడం చుట్టూ సాగుతుంది. గత శుక్రవారం ఏప్రిల్ 18న విడుదలైన కేసరి చాప్టర్ 2 మూవీకి అద్భుతమైన టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మరీ ఎక్కువ గ్రోత్ దక్కలేదు. మూడు రోజుల్లో ఎంత వచ్చిందంటే..

కేసరి చాప్టర్ 2 సినిమాకు మూడు రోజుల్లో ఇండియాలో రూ.29.75 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కాయి. మూడో రోజైన ఆదివారం వసూళ్లలతో కాస్త పెరుగుదల కనిపించింది. అయితే, టాక్ చాలా బాగుండటంతో కలెక్షన్లు ఎక్కువగా వస్తాయనే అంచనాలు వచ్చాయి. కానీ ఆ రేంజ్‍లో గ్రోత్ ...