భారతదేశం, జనవరి 16 -- బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నేడు (జనవరి 16) తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెండితెరపై ఆయన కనిపించే తీరు, ఆ కటౌట్, పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీ కుర్రకారుకు ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్. అయితే, అద్భుతమైన శరీరాకృతిని సాధించాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమట చిందించడమే కాదు, మనం ఏం తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. చాలామంది ఫిట్‌నెస్ అంటే ఖరీదైన డైట్ అని భావిస్తారు. కానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తన కెరీర్ ప్రారంభంలో పాటించిన డైట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అతి తక్కువ ధరలో లభించే ఒక సాధారణ ఆహారంతో ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు.

ముంబై లాంటి మహానగరంలో కొత్తగా అడుగుపెట్టిన నటులకు ఆడిషన్ల చుట్టూ తిరగడం, షూటింగ్‌ల కోసం వేచి చూడటం ఒక పెద్ద సవాలు. అప్పట్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా, ఆరోగ్యం విషయంలో తాను ఎప్పుడూ రాజీ...