Hyderabad, మే 13 -- సితారే జమీన్ పర్ ట్రైలర్: ఆమిర్ ఖాన్ మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్న మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమాలో అతడు ఓ బాస్కెట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. అతని సరసన జెనీలియా నటించింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం (మే 13) రిలీజ్ చేశారు. ఇది చాలా సరదాగా సాగిపోయింది.

స్పానిష్ మూవీ అయిన ఛాంపియన్స్ కు రీమేక్ ఈ సితారే జమీన్ పర్. 3 నిమిషాలకుపైగా ఉన్న ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో మానసిక దివ్యాంగుల బాస్కెట్ బాల్ టీమ్ కోచ్ గా ఆమిర్ ఖాన్ నటించాడు. నిజానికి అతడో సాధారణ టీమ్ కోచ్. కానీ తాగి కారు నడిపిస్తూ పోలీస్ వాహనాన్నే ఢీకొడతాడు. కోర్టు మెట్లెక్కుతాడు.

అక్కడ జడ్జి అతనికి మూడు నెలల పాటు మానసిక దివ్యాంగుల బాస్కెట్ బాల్ జట్టుకు కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. వాళ్లను ...