భారతదేశం, అక్టోబర్ 27 -- టీమిండియా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగించే వార్త ఇది. టీమ్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ కు తీవ్రమైన గాయమైంది. పక్కటెముకల లోపల బ్లీడింగ్ అయిందని తెలిసింది.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ ను అందుకునేందుకు శ్రేయస్ అయ్యర్ పాయింట్ నుంచి వెనక్కి పరుగెత్తాడు. సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. కానీ ఈ క్రమంలో అతని పక్కటెముకలకు తీవ్రమైన గాయమైంది. డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

శ్రేయస్ అయ్యర్ గాయం గురించి బీసీసీఐ కూడా ప్రకటన జారీ చేసింది. "25 అక్టోబర్ 2025 న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న...