భారతదేశం, డిసెంబర్ 17 -- ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవం జరుపుకొంటుండగా.. ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. ఈ దాడి చేసినవారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌ టోలిచౌకికి చెందినవాడు. మరో వ్యక్తి అతడి కుమారుడు, ఆస్ట్రేలియా పౌరుడైన నవీద్ అక్రమ్.

ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి పాల్గొనడం భారతదేశానికి అవమానం మాత్రమే కాదు, భద్రతాపరమైన ఆందోళన కూడా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. 'ఆస్ట్రేలియాలో సిడ్నీ ఉగ్రవాద చర్యతో హైదరాబాద్ సంబంధం, మాకు అవమానకరమైన విషయమే. అంతేకాదు ఇది తీవ్రమైన జాతీయ భద్రతా సమస్య కూడా.' అని రామచందర్ రావు చెప్పారు.

నిందితులు భారతదేశం విడిచి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి దర్యాప్తు చేయాలని తె...