భారతదేశం, జూన్ 17 -- విజయవాడ, జూన్ 17, 2025: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిట్ కార్యాలయం ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం దర్యాప్తును బలహీనపరిచేందుకు, సిట్ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని "అదృశ్య శక్తులు" కుట్రలు పన్నుతున్నాయని సిట్ ఆరోపించింది. ఈ కుట్ర కోణాన్ని బయటపెట్టి, న్యాయస్థానం ముందు ఉంచుతామని సిట్ కార్యాలయం తేల్చి చెప్పింది.

మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా, గత పదేళ్లుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి గన్‌మెన్‌ (PSO)గా పనిచేసిన ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారించింది. అయితే, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, సిట్ అధికారులు తనపై ఒత్త...