భారతదేశం, ఏప్రిల్ 17 -- వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదు. శుక్రవారం విచారణకు రావాలని సిట్‌ అధికారులు నోటీసులు ఇవ్వగా గురువారమే వస్తానని చెప్పిన సాయిరెడ్డి, చివరి నిమిషంలో విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయిరెడ్డిని మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలపై సిట్‌ విచారణలో వేగం పెరిగింది. గురువారం సిట్‌ విచారణకు రావాలని మాజీ ఎంపీ సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం జరిగింది. అయితే విజయవాడలో జరగాల్సిన విచారణకు సాయిరెడ్డి హాజరు కాలేదు. దీంతో సాయిరెడ్డికి మరోసారి విచారణకు పిలుస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ కేసులో ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి. ...