భారతదేశం, ఏప్రిల్ 19 -- మద్యం కుంభకోణం కేసులో సిట్‌ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి. విజయవాడలో సిట్‌ కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెనక.. రాజ్‌ కసిరెడ్డితో పాటు ఎంపీ మిథున్‌ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేయకుండా స్టే విధించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత...